అల్లు అర్జున్ నటించిన పుష్ప‌-2 సినిమా డిసెంబ‌ర్ 5న థియేట‌ర్‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. టిక్కెట్ ధ‌ర పెంపునకు ఏపీ ప్ర‌భుత్వం కూడా అనుమ‌తి ఇచ్చింది. బెనిఫిట్ షోల‌కు టిక్కెట్టు ధ‌ర‌ రూ.800గా పెంచారు. అలాగే మొద‌టి రోజు డిసెంబ‌ర్ 5 తేదీన సింగిల్ స్క్రీన్‌ల‌లో లోయ‌ర్ క్లాస్ టిక్కెట్టు రూ.100, అప్ప‌ర్ క్లాస్ టిక్కెట్టు రూ.150, మ‌ల్టీఫ్లెక్స్‌లో రూ.200కు పెంచారు. డిసెంబ‌ర్ 17 వ‌ర‌కు ఈ ధ‌ర‌లు అమ‌లులో ఉంటాయి. టిక్కెట్ల పెంపును వ్య‌తిరేకిస్తూ హైకోర్టులో పిటిష‌న్ కూడా దాఖ‌లు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here