అల్లు అర్జున్(allu arjun)నటించిన పుష్ప 2(pushpa 2)ఈ రోజువరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే. కాకపోతే నిన్న నైట్ తొమ్మిదిన్నర గంటల నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రీమియర్స్ కూడా వెయ్యడం జరిగింది.ఈ ప్రీమియర్ షోస్ చూడటానికి అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి పోటెత్తారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అభిమాని అయిన ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ ఆర్ టిసి క్రాస్ రోడ్డులోని సంధ్య(sandhya theater)థియేటర్ వద్దకు చేరుకుంది.ఇక అల్లు అర్జున్ కూడా సంధ్య థియేటర్ వద్దకు ప్రీమియర్ షో చూడటానికి రావడంతో అల్లు అర్జున్ ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు.దీంతో పోలీసులు కూడా కంట్రోల్ చెయ్యలేని పరిస్థితి ఏర్పడగా ఈ సందర్భంగా   తొక్కిసలాట జరిగింది.దీంతో సదరు మహిళ ఊపిరాడక చనిపోవడం జరిగింది.ఇద్దరు పిల్లల్లో ఒక బాబు కి గాయాలవ్వడంతో  హాస్పిటల్ కి తీసుకెళ్లగా ఐసియులో ఉంచి  ట్రీట్ మెంట్ చేస్తునట్టు  సమాచారం.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here