Hyundai cars price hike: వచ్చే ఏడాది జనవరి నుంచి తమ లైనప్ లోని అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్ ప్రకటించింది. ఈ కొరియన్ ఆటో దిగ్గజం క్రెటా, వెన్యూ, ఎక్స్టర్, టక్సన్, అల్కాజర్ వంటి పాపులర్ ఎస్యూవీలతో పాటు వెర్నా ఐ 20, ఐ 10, తమ ఏకైక ఎలక్ట్రిక్ వాహనం అయోనిక్ 5తో సహా భారతదేశంలో అందుబాటులో ఉన్న అన్ని మోడళ్ల ధరలను పెంచనుంది. ఇన్ పుట్ మెటీరియల్ ఖర్చు పెరగడం, లాజిస్టిక్స్ ఖర్చు, ప్రతికూల మారకం రేట్ల కారణంగా వచ్చే నెల నుంచి ధరల పెంపు అనివార్యమైందని హ్యుందాయ్ తెలిపింది.