హిందూ సంప్రదాయాల్లో పూజలు, వత్రాలకు విశిష్ట ప్రాధ్యాన్యత ఉంటుంది. సాధన, భక్తి, శాంతికి దైవారాధనే ప్రధాన మార్గంగా భావిస్తారు. దేవుడిని పూజించడం వల్ల మనసులో శాంతి, నిగ్రహం, ఆరోగ్యం, సంతోషం, ధనవృద్ధి కలుగుతాయి. పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. వ్యక్తిలోని భయం, భాదలు తొలగిపోయి ధైర్యం, విశ్వాసం కలగాలంటే ఇష్ట దైవానికి పూజ చేయడం చాలా ముఖ్యమని హిందువులు నమ్ముతారు. అయితే పూజలు చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు పాటిస్తేనే వాటి ఫలితాలు దక్కుతాయని హిందూ ఆచారాలు చెబుతున్నాయి. హిందూ ఆచారాల ప్రకారం పూజలు చేసేటప్పుడు స్త్రీలు జుట్టును విరబోసుకోకూడదు. చక్కగా జడవేసుకుని అలంకరించకుని చేసే పూజలు మాత్రమే ఫలితాయి.ఇందుకు కొన్ని ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.