చెల్లుబాటు కాని సర్టిఫికెట్లు..
ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్న సర్టిఫికెట్ల చెల్లుబాటు కూడా ప్రశ్నార్థకం అవుతోంది. సచివాలయాలు, మీ సేవల్లో జారీ చేసే సర్టిఫికెట్లను గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో ఇస్తున్నారు. ప్రభుత్వ అధికారిక చిహ్నాలతో క్యూఆర్ కోడ్‌తో పాటు వాటికి గుర్తింపు ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఎవరికి వారు సొంతంగా దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి ధృవీకరణ ఉండటం లేదు. న్యాయస్థానాలు ఇలాంటి సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్నాయి. సివిల్ వివాదాల్లో ఈసీలు, సర్టిఫైడ్ కాపీలపై ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేకపోవడంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి.