పుష్ప 2 సినిమానే కాదు అదో ప్రయాణం. నీకు, నీ టీమ్ కు శుభాకాంక్షలు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నువ్వెప్పుడూ నా హీరో, నా ఆదర్శప్రాయుడివి. నీకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ నేనే ఎప్పుడూ నీ నంబర్ వన్ అభిమానిని. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ కదా.. కాదు వైల్డ్ ఫైరు.. ప్రపంచంలోనే అత్యంత గర్వపడుతున్న మీ కొడుకు బుజ్జి బాబు” అని అయాన్ రాయడం విశేషం. నా కొడుకు అయాన్ లేఖ మనసుకు హత్తుకునేలా ఉందంటూ అల్లు అర్జున్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ లెటర్ షేర్ చేశాడు.