సూర్యాస్తమయం సమయంలో కూడా దీపారాధన చేయాలి. పెద్దలు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. లోకాలకి వెలుగుని, తేజస్సును ప్రసాదిస్తారు సూర్యుడు. అయితే, తాను లేనప్పుడు జీవులు ఎలా ఉంటారని సూర్యుడు తన తేజస్సుని దీపంలో ఉంచుతాడు. అందుకని కచ్చితంగా సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయాలని అంటారు.