Harish Rao Arrest: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకుడు హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని గచ్చిబౌలికి తరలించారు. హరీష్ రావును ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.