కొండాపూర్‌లోని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి ఎమ్మెల్యే హరీశ్ రావు కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో అప్పటికే అక్కడ భారీగా మోహరించిన గచ్చిబౌలి పోలీసులు.. హరీశ్ రావును అడ్డుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసుల బలవంతంగా కారులో ఎక్కించారు. అక్కడి నుంచి తరలిస్తుండగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.