సూర్య(suriya)హీరోగా శివ(siva)దర్శకత్వంలో గ్రీన్ స్టూడియో పతాకంపై జ్ఞానవేల్ రాజా(jnanavel raja)నిర్మించిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ'(kanguva) నవంబర్ 14 న వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందు ప్రమోషన్స్ సమయంలో ఎన్నో అంచనాలని క్రియేట్ చేసుకున్న’కంగువ’ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూసింది.దీనిపై ఆ చిత్ర సహా నిర్మాత ధనుంజయ్ అయితే ‘కంగువ’ మూవీ బాగానే ఉన్నా కూడా తమిళ నాట ఉన్న ఇద్దరు అగ్ర హీరోల అభిమానులు,రెండు రాజకీయ పార్టీల కార్యకర్తలు కావాలని కంగువ కి నెగిటివ్ టాక్ తెచ్చారనే సంచలన ఆరోపణలు కూడా చేసాడు.ఇక కంగువ మూవీ డిసెంబర్  8 న ఓటిటి లో అమెజాన్(amazon prime)ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది.ఈ మేరకు అధికారకంగా సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ని కూడా  రిలీజ్ చేసింది. తెలుగుతో పాటు తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుండగా హిందీ వర్షన్ లో మాత్రం విడుదల కావటం లేదు.సూర్య సరసన బాలీవుడ్ హీరోయిన్  దిశా పటాని(disa patani) జత కట్టగా బాబీడియోల్,నటరాజ సుబ్రహ్మణ్యం, యోగిబాబు, రెడీన్ కింగ్ స్లే కోవై సరళ వంటి వారు ప్రధాన పాత్రల్లో  చేసారు.

 


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here