అల్లు అర్జున్(allu arjun)సుకుమార్(sukumar)కాంబోలో ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన పుష్ప 2(pushpa 2)నిన్న డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదలైంది.ఇక రిలీజ్ కంటే ఒక రోజు ముందు నైట్ అభిమానుల కోసం చాలా ఏరియాల్లో బెనిఫిట్ షోస్ కూడా వేశారు. అందులో భాగంగా హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్ లో కూడా బెనిఫిట్ షో వెయ్యడం జరుగగా,ఆ షో కి అల్లు అర్జున్ కూడా హాజరయ్యాడు. దీంతో తొక్కిసలాట జరిగి రేణుక అనే మహిళ మృతి చెందగా,ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో మృత్యువు తో పోరాడుతున్నాడు.
ఈ సంఘటనపై సంధ్య థియేటర్(sandhya theater)పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఒక పిటిషన్ వచ్చింది.చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో లాఠీచార్జీ చెయ్యడం,థియేటర్ యాజమాన్యం ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాల వల్లే రేణుక అనే మహిళ మృతి చెందింది.ఘటనకు కారణమైన అందరిపై చర్యలు తీసుకోవాలి. సిటీ పోలీస్ యాక్ట్ కింద ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేసారని పిటిషనర్ కోరడం జరిగింది. కమిషన్ కూడా ఈ కేసుని విచారణకి స్వీకరించింది.