ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)నటించిన పుష్ప 2(pushpa 2)నిన్న డిసెంబర్ 5 న  వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే.ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షో లు కూడా జరుపుకున్న ఈ మూవీ ఇప్పుడు పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది.సుకుమార్(sukumar)దర్శకత్వ ప్రతిభ,అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (mythri movie makers)నిర్మాణ విలువలు ఒక రేంజ్ లో ఉన్నాయనే అభిప్రాయాన్ని మూవీ చూసిన ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ మూవీ ఫస్ట్ డే ఎంతమేర కలెక్షన్స్ ని వసూలు చేసిందో చూద్దాం. 

వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మొదటి రోజు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలని సాధించి  ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్త చరిత్రని సృష్టించిందని చెప్పవచ్చు.ఇండియా వైడ్ గా చూసుకుంటే తెలుగులో తొంబై ఐదు కోట్ల పది లక్షలు, హిందీలో అరవై ఏడు కోట్లు, తమిళంలో ఏడు కోట్లు,కన్నడలో ఒక కోటి,మలయాళంలో ఐదు కోట్లుతో మొత్తం నూటడెబ్భైఐదు కోట్ల పదిలక్షల రికార్డు కలెక్షన్స్ ని సాధించింది.

నెట్ కలెక్షన్స్ వారీగా చూసుకుంటే పుష్ప 2 160 కోట్లని సాధించగా ఆర్ఆర్ఆర్ నూటముప్పై మూడు కోట్లు, బాహుబలి 2 నూటఇరవై ఒక్క కోట్లు,కేజీఎఫ్ 2 నూటపదహారు కోట్లుతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here