శరీర బరువు పెరగడం అనేది ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్య. కొంతమంది ఎంత ప్రయత్నించినా శరీరంలో ఎలాంటి మార్పు ఉండదు. బరువు ఏమాత్రం తగ్గరు. మీరుబరువు తగ్గించే పద్ధతులను ప్రయత్నించి అలసిపోతే చివరిగా ఈ సూర్య ముద్రను ప్రయత్నించండి. ప్రతిరోజూ ఈ భంగిమలో ఒక పావుగంట పాటూ కూర్చోవడానికి ప్రయత్నించండి. ఇలా మీరు రెండు నెలలు కూర్చుని చూడండి మీ బరువులో ఎంతో మార్పు కనిపిస్తుంది. ఇది ఒక రకమైన యోగా భంగిమ, ఇది శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. సూర్యముద్ర కేవలం బరువు తగ్గడానికే కాదు, ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.