కుటుంబ సభ్యులకు సమాచారం
ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని సార్నియా పోలీస్ చీఫ్ డెరెక్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ఈ హత్య (Murder) కు సంబంధించిన అన్ని ఆధారాలను సర్నియా పోలీసు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం సేకరిస్తూనే ఉంది. ఈ నేరం జాతి వివక్ష ప్రేరేపితమని మేము విశ్వసించడం లేదు’’ అని తెలిపారు. ఈ ఘటనపై లాంబ్టన్ కాలేజ్ స్పందించింది. ఈ ఘటనతో ఒక విద్యార్థిని కోల్పోవడం అత్యంత పెద్ద విషాదమని, ఆ విద్యార్థి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని ప్రకటించింది. విద్యార్థి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాన్ని భారత్ కు పంపించడంపై వారితో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది.