అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాయచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో పని చేస్తున్న ఏజాస్ అనే ఉపాధ్యాయుడిని 9వ తరగతి విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే కొట్టి చంపేశారు. అయితే విద్యార్థులు అల్లరి చేయడంతో ఏజాస్ మందలించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు ఎదురు తిరిగి టీచర్ ని కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మాట్లాడిన ఉపాధ్యాయుడి భార్య.. తన భర్తకు ఆరోగ్యం బాగుందన్నారు. విద్యార్థుల దాడితో భర్త మరణం సంభవించిందని కన్నీటి పర్యంతం అయ్యారు.