రెక్కీ తర్వాత చోరీ – సీపీ అంబర్ కిషోర్ ఝా
“పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మహమ్మద్ నవాబ్ హసన్ కొద్ది రోజుల కిందిత ఉత్తరప్రదేశ్ నుండి వచ్చి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో వుండే బ్యాంక్లు, బ్యాంక్ భద్రత ఏర్పాట్లపై రెక్కీ నిర్వహించాడు. అనంతరం నిందితుడు ఉత్తర ప్రదేశ్, మహరాష్ట్రలకు చెందిన మిగితా నిందితులు కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. వ్యాపారం ముసుగులో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ముఠా ముందుగా గుగూల్ ద్వారా మారూమూల ప్రాంతాల్లోని బ్యాంకుల సమాచారాన్ని సేకరించడం జరిగింది” అని సీపీ వివరించారు.