తెలుగు ప్రజలకి పరిచయం అక్కర్లేని పేరు వేణుస్వామి(venu swamy).ఆస్ట్రాలజర్ గా పలు సినీ,వ్యాపార, రాజకీయ రంగానికి చెందిన సెలబ్రిటీ లకి సంబంధించి వాళ్ల జాతకాల్లో ఏం జరగబోతుందో ముందే చెప్తూ  వివాదాస్పద జోతిష్యుడుగా కూడా పేరు సంపాదించాడు.పోలీసు కేసులు కూడా నమోదు కావడం జరిగింది.

రీసెంట్ గా వేణు స్వామి మొన్న విడుదలైన పుష్ప 2(pushpa 2)గురించి మాట్లాడుతు పుష్ప 2 సినిమా చూసాను. అల్లు అర్జున్(allu arjun)గారు సూపర్ గా చేసారు. ముఖ్యంగా రాజా మాతంగి గెటప్ లో బ్లు కలర్ శారీలో జాతర సీన్ ఇరగదీశారు.2016 నుంచి అల్లు అర్జున్ గారి జాతకాన్ని కొన్ని ఛానల్స్ లో విశ్లేషించి చెప్పాను.వాటిల్లో అసలైన పాన్ ఇండియాస్టార్ అల్లుఅర్జున్,మాత్రమే,వచ్చే పది సంవత్సరాల దాకా అలాగే కొనసాగుతాడు.అల్లు అర్జున్ తో సినిమా చేస్తే ప్రొడ్యూసర్, బయ్యర్లు నష్ట పోరు.ఏ సినిమా చేసినా కూడా హిట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియోల్ని వేణుస్వామి సోషల్ మీడియా వేదికగా మరోసారి ప్రేక్షకులకి గుర్తు చేస్తున్నాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here