ఊరు నుంచి విదేశాలకు

ఊరూరా రేషన్ బియ్యం సేకరణను ఒక చైన్ ఏర్పాటు చేసి, వాటిని మిల్లులకు చేరవేస్తుంటారు. ఇలా భారీగా సేకరించిన రేషన్ బియ్యాన్ని బడా రైస్ మిల్లుల వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ఇలా తరలించినప్పుడే రేషన్ బియ్యం పట్టివేత వార్తలు అడపాదడపా వింటుంటాం. వాస్తవానికి దొరికేది క్వింటాల్లో…తరలిపోయేది టన్నుల్లో అనేది జగమెరిగిన సత్యం. రేషన్ బియ్యాన్ని సేకరించిన బడా వ్యాపారులు…వాటిని ప్రాసెస్ చేసి విదేశాలకు భారీ ధరలకు విక్రయిస్తుంటారు. ఈ వ్యాపారం మొత్తం పోర్టుల ద్వారా జరుగుతోందని ఎప్పటి నుంచో వినిపిస్తున్న, కనిపిస్తున్న వాస్తవం. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘సీజ్ ది షిప్’ ఆదేశాలతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక వేల కోట్ల దందా ఉందని, టన్నుల కొద్ది రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుందని మీడియా కొన్ని రోజులు హడావుడి చేసింది. రేషన్ బియ్యం మాఫియా వెనుక ఉన్న వారెవ్వరో ఇప్పటికైనా బయటపడుతుందా? అంటే వేచి చూడాల్సిందే. చూసేందుకు చాలా చిన్న వ్యాపారంలో ఉన్నా…దీని వెనుక వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఘటనల ద్వారా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ వేసింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here