ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)నటించిన పుష్ప 2(pushpa 2)నిన్న డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే హిందీ లో కూడా భారీ ఎత్తున విడుదలై అక్కడి సినిమాలకి సవాలు విసురుతు రికార్డు కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది.
హిందీలో తొలి రోజు 72 కోట్ల రూపాయిల నెట్ కలెక్షన్స్ ని వసూలు చేసి బాలీవుడ్ లోనే హయ్యస్ట్ కల్లెక్షన్ సాధించిన మొదటి మూవీగా నిలవగా ఇప్పుడు రెండవ రోజు యాభై తొమ్మిది కోట్ల రూపాయిల నెట్ కల్లెక్షన్స్ ని సాధించి టోటల్ రెండు రోజులకి 131 కోట్ల కలెక్షన్స్ ని సాధించిన ఫస్ట్ హిందీ మూవీ గా నిలిచింది.
ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే రెండు రోజులకి 449 కోట్ల గ్రాస్ ని సాధించి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫస్ట్ డే కూడా 294 కోట్లు సాధించి ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలిచింది.అల్లు అర్జున్ నటన,సుకుమార్(sukumar)దర్శకత్వ ప్రతిభ,అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers)నిర్మాణ విలువలు పుష్ప 2 విజయానికి కారణమనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్త మవుతుంది.