రైతు రుణమాఫీ పథకంలో భాగంగా జులై 18న తొలి విడతగా లక్ష రూపాయల లోపు రుణాలున్న రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. కొద్దిరోజులు కిందట ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి.. రుణమాఫీ లెక్కలను కూడా ప్రస్తావించారు. మొదటి విడతలో 11,34412 రైతుల ఖాతాల్లోకి రూ. 6,034,97 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ఇక రెండో విడతలో 640823 మంది రైతుల ఖాతాల్లోకి రూ. 6,190,01 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. మూడో విడత కింద 446832 రైతుల ఖాతాల్లోకి రూ. 5,544,24 జమ చేసినట్లు ప్రస్తావించారు.