తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్ ఆరోపించారు. రైతు బంధు, తెలంగాణ తల్లి విగ్రహం, మూసీ, హైడ్రా, గురుకులాలు, విద్యారంగంపై ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ ప్రస్తావించాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలు, వైఫల్యాలను ఎత్తి చూపాలన్నారు. ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఫిబ్రవరి బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసఆర్ పార్టీ శ్రేణులకు తెలిపారు. కమిటీ ఏర్పాటు తర్వాత సభ్యత నమోదు చేపడతామన్నారు.