వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మర్డర్ మిస్టరీ వీడింది. రూ.5 లక్షల అప్పు ఇవ్వనందుకే మాజీ జర్నలిస్ట్ హత్య చేసినట్లు తేలింది. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు… కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.