కాణిపాకం దేవాలయం చుట్టూ ప్రకృతి సౌందర్యం కూడా ఉంది. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన వాతావరణం భక్తులకు ప్రశాంతతను అందిస్తాయి. సమీపంలో ఉన్న అరవింద తీర్థం, శివాలయం కూడా సందర్శకుల హృదయాలను ఆకర్షిస్తాయి అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. కాణిపాకం దేవాలయం పౌరాణికత, భక్తి, శ్రద్ధ ప్రకృతి సౌందర్యాల సమ్మేళనం. ఇది భక్తుల కోరికలను తీర్చే పవిత్ర స్థలం. కాణిపాకం స్వామి ప్రసాదం అనుభవించేందుకు, భక్తులు ఎక్కడి నుండైనా ఇక్కడికి రావచ్చు. ఈ ప్రదేశం భక్తుల విశ్వాసానికి నిలువుటద్దంగా నిలిచింది. ఈ పవిత్ర స్థలాన్ని దర్శించడం వల్ల భక్తుల జీవనంలో ఆధ్యాత్మిక శక్తి నిండుతుంది అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.