ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలపై పోరాటం – గోపిమూర్తి
సంఘం నిర్ణయం మేరకు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశానని ఎమ్మెల్సీగా ఎన్నికైన గోపిమూర్తి తెలిపారు. సీపీఎస్ రద్దు కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందనన్నారు. అన్ని రంగాల్లో వలె విద్యారంగంలో ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్, జెఎల్ ప్రమోషన్,అందరికీ హెల్త్ కార్డులు, ఐటీడీఏ పాఠశాలల్లో అప్ గ్రేడేషన్, జీవో నెంబర్ 3 అమలు, మున్సిపల్, ఎయిడెడ్ టీచర్ల సమస్యలు, ఎయిడెడ్ పాఠశాలల పోస్టుల భర్తీ, మోడల్ స్కూల్స్, కేజీబీవీ టీచర్ల సమస్యలు తదితర సమస్యల సాధనకై పీడీఎఫ్ ఎమ్మెల్సీలతో కలిసి భవిష్యత్తులో పోరాటం చేస్తానని అన్నారు.