మోపిదేవి పదవీ కాలం రెండేళ్లలోపు ఉండటంతో పాటు అనారోగ్య సమస్యలు, ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలనే ఉద్దేశంతోనే నాగబాబు రాజ్యసభకు వెళ్లడం లేదని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని జనసేన ప్రతిపాదించలేదని టీడీపీ వర్గాలు కూడా స్పష్టం చేశాయి.బీజేపీ రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేయడంతో మిగిలిన రెండు స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హర్యానా, ఒడిశాల రాజ్యసభ అభ్యర్థుల్ని కూడా బీజేపీ ప్రకటించింది.
Home Andhra Pradesh ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య పేరును ఖరారు చేసిన బీజేపీ-bjp finalizes r krishnaiahs...