రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నాడు. ‘గర్ల్ ఫ్రెండ్’ టీంని విజయ్ దేవరకొండ గిఫ్ట్ అందించాడు. టీజర్ ని వాయిస్ ఓవర్ అందించడం కాకుండా, టీజర్ ను తన చేతుల మీదుగా విడుదల చేశాడు. (The Girlfriend Teaser)
విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా టీజర్ రిలీజ్ తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, గర్ల్ ఫ్రెండ్ టీజర్ లోని ప్రతి విజువల్ ఆకట్టుకుంది. ఈ మూవీని చూసేందుకు వెయిట్ చేస్తున్నా. 8 ఏళ్ల క్రిితం రష్మికను సెట్ లో కలిశా. ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తున్నా రష్మిక వ్యక్తిగతంగా ఇప్పటికీ అంతే హంబుల్ గా ఉంది. నటిగా ఆమెకు ‘ది గర్ల్ ఫ్రెండ్’ మరింత బాధ్యతను ఇచ్చింది. సక్సెస్ ఫుల్ గా రష్మిక ఆ బాధ్యత వహిస్తుందని ఆశిస్తున్నా. ప్రతి ప్రేక్షకుడినీ కదిలించే మంచి కథను ఈ సినిమాతో డైరెక్టర్ రాహుల్ చూపిస్తాడని నమ్ముతున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నాడు.
“ది గర్ల్ ఫ్రెండ్” టీజర్ విషయానికొస్తే.. కాలేజ్ హాస్టల్ లోకి రష్మిక అడుగుపెడుతున్న సీన్ తో టీజర్ మొదలైంది. హీరో దీక్షిత్, రష్మిక క్యారెక్టర్స్ పరిచయం, వారి మధ్య బ్యూటిఫుల్ రిలేషన్ ను చూపించారు. ఆ కాలేజ్ లో లీడ్ పెయిర్ చేసిన జర్నీ ఎంతో ఎమోషనల్ గా ఉంది. “నయనం నయనం కలిసే తరుణం, ఎదనం పరుగే పెరిగే వేగం..” అంటూ విజయ్ ఇచ్చిన వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “ఇదేదో పికప్ లైన్ అయితే కాదుగా.. అస్సలు పడను” అంటూ రష్మిక చెప్పిన డైలాగ్ తో టీజర్ ను ముగించారు. టీజర్ ని బట్టి ఇదొక వైవిధ్యమైన ప్రేమకథ అనిపిస్తోంది.
“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా కృష్ణన్ వసంత్, ప్రొడక్షన్ డిజైనర్స్ గా ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి వ్యవహరిస్తున్నారు.