అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప2’ కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టిస్తూ, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల్లో రూ.829 కోట్లు కలెక్ట్ చేసి రూ.1000 కోట్ల క్లబ్లో చేరేందుకు పరుగులు తీస్తోంది. పెంచిన టికెట్ ధరలకు భయపడి కొందరు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇది గమనించిన మేకర్స్ సోమవారం నుంచి టికెట్ ధరలను బాగా తగ్గించారు. గత నాలుగు రోజులుగా కొన్నిచోట్ల ఖాళీగా ఉన్న థియేటర్లు ఇప్పుడు పుంజుకుంటున్నాయి. దీన్నిబట్టి పుష్పరాజ్ తన టార్గెట్‌ను ఈజీగానే రీచ్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.
గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్‌కి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. రోజు రోజుకీ మెగా ప్యామిలీకి, బన్నికి మధ్య దూరం పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఫోటో హల్చల్ చేస్తోంది. మెగాస్టార్ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. చిరంజీవి, సురేఖతో కలిసి దిగిన ఫోటో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పుష్ప2 సక్సెస్ తర్వాత మెగాస్టార్‌ని అల్లు అర్జున్ కలిసిన ఫోటోయేనా ఇది? అనే ఆలోచనలో పడ్డారు. నిజానికి ఇది ఇప్పటి ఫోటో కాదు. పుష్ప చిత్రానికి అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వచ్చినపుడు తన భార్య సురేఖతో కలిసి వెళ్ళి బన్నీని అభినందించారు చిరు. అప్పటి ఫోటోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అభిమానులు. అదీ విషయం.