అసద్ పాలన ముగింపు మధ్యప్రాచ్య భౌగోళిక రాజకీయాలలో ప్రధాన మార్పునకు కారణం అవుతుంది. దశాబ్దాలుగా అసద్ నేతృత్వంలోని సిరియా.. ఇరాన్‌కు కీలక మిత్రదేశంగా, ఈ ప్రాంతంలో రష్యా కోసం కూడా పనిచేసింది. కానీ ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా దృష్టి పెట్టడం, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న వివాదం కారణంగా హిజ్బుల్లా బలహీనపడటం అసద్ పతనానికి దోహదపడింది. యూఏఈ, ఈజిప్ట్, జోర్డాన్ వంటి శక్తుల నుండి మద్దతు కోరేందుకు ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు.