అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్ హైదరాబాదులో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ సుకుమార్, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురికి అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. మొదట తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. రేవంత్ రెడ్డి పేరుని గుర్తు చేసుకునే క్రమంలో కాస్త తడబడినట్లు కనిపిస్తుంది. దీనిపై అల్లు అర్జున్ ని సోషల్ మీడియా వేదికగా పలువురు ట్రోల్ చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి పేరుని అన్ని మర్చిపోయారా..? ఆ వీడియోని మీరు చూడండి.