ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్‌గా నిలిచింది. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో ఆరు భాషల్లో రిలీజైన పుష్ప2 మూవీ.. ఐదు రోజుల్లోనే ఏకంగా రూ.800 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. అయితే.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, బెంగాలీలో దుమ్మురేపుతున్న పుష్ప 2.. మలయాళంలో మాత్రం ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోతోంది. దానికి కారణం.. మల్లు ఫ్యాన్స్ గుర్రుగా ఉండటమేనని తెలుస్తోంది.