తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద టీ షర్ట్స్ లొల్లి జరిగింది. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. అదానీ, రేవంత్ ఫొటోలు ఉన్న టీ షర్టులను ధరించి అసెంబ్లికి రావడంతో.. బీఆర్ఎస్ సభ్యులను గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ గేటువద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. అటు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్కు తరలించారు.