TG Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10.30కు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు 5 కీలక బిల్లులతో పాటు.. 2 నివేదికలను సభలో ప్రవేశ పెడతారు. తెలంగాణలో ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హ తల తొలగింపు బిల్లు (సవరణ), తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లు, హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అమెండ్మెంట్ బిల్లు, తెలంగాణ జిఎస్టీ సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులు, 2022-23 సంవత్సరానికి గాను ఎలక్ట్రిసిటీ ఫైనాన్స్ 9వ వార్షిక నివేదిక, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదికను సభ ముందు ప్రవేశపెడతారు.