ప్రముఖ అగ్ర హీరో మోహన్ బాబు(mohan babu)ఆయన తనయుడు ప్రముఖ హీరో మనోజ్(manoj)మధ్య ఆస్తులకి సంబంధించిన గొడవలు గత రెండు రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు అయితే ఏకంగా మనోజ్ వల్ల ప్రాణ హాని కూడా ఉందని పోలీసులకి ఫిర్యాదు చేసాడు. ఈ నేపథ్యంలో మనోజ్ కూడా మాట్లాడుతు నా పోరాటం ఆస్తుల మీద కాదు,ఆత్మ గౌరవం కోసమే  పోరాటం చేస్తున్నాను.పోలీసులు నా తండ్రి మాట విని ఏకపక్షంగా వ్యవహరించటం వలన ఇంట్లో ఉన్న నా భార్యా పిల్లలకు రక్షణ లేకుండా పోయింది.న్యాయం కోసం అందరిని కలుస్తానని చెప్పడం జరిగింది

ఇప్పడు అన్నట్టుగానే మనోజ్ తన భార్య మౌనిక తో కలిసి  తెలంగాణ డిజీపీ ని కలిసి తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై  వివరణ ఇవ్వడం జరిగింది.తమకు రక్షణ కల్పించాలని కూడా కోరగా డి జీ పీ అందుకు సముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఈ విషయం మొత్తం మీద మోహన్ బాబు ఇంటి పని మనిషి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here