రూ.4677 కోట్ల ఆదాయం
రాష్ట్ర వ్యాప్తంగా 3,300 లిక్కర్ దుకాణాల టెండర్ల రూపంలో ప్రభుత్వానికి దాదాపు రూ.2,000 కోట్ల ఆదాయం సమకూరింది. అక్టోబర్ 16వ తేదీ నుంచి నూతన మద్యం షాపులు ప్రారంభం అయ్యాయి. అయితే నిబంధనల ప్రకారం షాపులు పాడుకున్న యజమానులకు 20 శాతం కమిషన్ ఇవ్వాలి. అయితే ఇంకా పాత మద్యమే విక్రయిస్తున్నట్లు చెబుతున్న ఎక్సైజ్ శాఖ…కమిషన్ తక్కువగా ఇస్తుంది. ఇప్పటికైనా 20 శాతం కమిషన్ ఇవ్వాలని మద్యం షాపుల యజమానుల నుంచి ఒత్తిడి వస్తుంది. 20 శాతం కమిషన్ ఇవ్వకుంటే నష్టాలు వస్తాయని మద్యం దుకాణాలు యజమానులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లలో కలిపి అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు రూ.4,677 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. రానున్న రోజుల్లో లిక్కర్ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. క్రిస్టమస్, సంక్రాంతి సీజన్ కావడంచో లిక్కర్ సేల్స్ మరింత పెరుగుతాయని అంటున్నారు.