బాలనటుడిగా అనేక చిత్రాల్లోనటించిన తేజసజ్జా(teja sajja)’హనుమాన్'(hanuman)మూవీతో ఓవర్ నైట్ పాన్ ఇండియా హీరో ఇమేజ్ ని సంపాదించాడనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ప్రస్తుతం ‘మిరాయ్’ అనే వినూత్నమైన టైటిల్ తో కూడిన మూవీ చేస్తున్నాడు.నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదల కాబోతున్న ఈ మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇప్పటికే చాలా మంది స్టార్ నటులు ‘మిరాయ్’ లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే మంచు మనోజ్(manchu manoj)కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఈ మేరకు అధికారంగా ప్రకటన కూడా వచ్చింది.లేటెస్ట్ గా స్టార్ హీరోయిన్ శ్రీయ(shriya saran)ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుందనే వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ శ్రీయా స్పెషల్ సాంగ్ లో నటించడం ఖాయమైతే మరి తేజ తో కలిసి ఆ సాంగ్ లో చేస్తుందా లేక, సపరేట్ సాంగ్ గా ఉంటుందా అనేది తెలియాలి.
కెమెరామెన్ గా ఎన్నో హిట్ చిత్రాలకి పని చేసిన కార్తీక్ ఘట్టమనేని(karthik ghattamaneni)’మిరాయ్’ కి దర్శకుడిగా పని చేస్తున్నాడు.గతంలో రవితేజ(ravi teja)తో ఈగల్, నిఖిల్ తో సూర్య వర్సస్ సూర్య వంటి పలు చిత్రాలకి దర్శకత్వం వహించిన కార్తీక్ ప్రేక్షకుల్లో తన కంటు ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజైన తేజ లుక్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచేలా చేస్తుంది.అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా(people media factory)ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘హనుమాన్’ మూవీ ఫేమ్ గౌరహరి సంగీతాన్నిఅందిస్తుండగా రితిక నాయక్ హీరోయిన్ గా చేస్తుంది.