పోకో ఎం 6 ప్లస్ ఎందుకు కొనాలి?
పోకో ఎం6 ప్లస్ స్పెసిఫికేషన్స్ చూస్తే.. ఇందులో 6.79 ఇంచ్ అడాప్టివ్ సింక్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 యాక్సిలరేటెడ్ ఎడిషన్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. పోకో ఎం6 ప్లస్ డ్యూయల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 3 ఎక్స్ ఇన్-సెన్సార్ జూమ్ ఉన్నాయి. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఇందులో ఉంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5030 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. షియోమీ హైపర్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్లో ఏఐ నైట్ మోడ్ వంటి పలు అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అందువల్ల ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేస్తే రూ.10,000 లోపు విలువైన స్మార్ట్‌ఫోన్ ఇది.