డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా  విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)వన్ మ్యాన్ షో పుష్ప 2(pushpa 2)ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త హిస్టరీ ని క్రియేట్ చేస్తుంది.రిలీజైన అన్ని లాంగ్వేజెస్ లో కూడా అంతకు ముందు వరకు అక్కడ ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నిటిని క్రాస్ చేస్తు తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తుంది.

దీంతో పుష్ప ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల గ్రాస్ ని సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించింది.కేవలం ఐదు రోజుల్లో అత్యంత ఫాస్టెస్ట్ గా ఆ మేర  కలెక్షన్స్ ని సాధించిన సినిమా ఇంతరవరకు లేదనే చెప్పాలి.ఇక చిత్ర యూనిట్ ముందు నుంచి కూడా భావిస్తున్న వెయ్యి కోట్ల మార్క్ ఎంత దూరంలోనే లేదనే చెప్పాలి.

ఇక పుష్ప 2 కి హిందీలో అయితే విశేష ఆదరణ లభిస్తుంది.అక్కడ ఇప్పటి వరకు 291 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టగా ఇప్పుడు అది 750 కోట్ల దాకా సాధించవచ్చని బాలీవుడ్ వర్గాలే వారే చెప్తున్నారు.దీన్ని బట్టి పుష్ప మానియా బాలీవుడ్ ని ఎంత ఊపు ఊపుతుందో చెప్పవచ్చు. రీసెంట్ గా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్(amitabh bachchan)సోషల్ మీడియా వేదికగా  పుష్ప 2 గురించి ప్రస్తావిస్తు ‘మీ ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులమయ్యాం అంటూ ట్వీట్ చెయ్యడం కూడా జరిగింది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here