ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా వస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్ లైన్ తో ఈ మూవీ రానుంది. బసవరాజు లహరిధర్ నిర్మాణంలో కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు పలు విషయాలు సినిమా గురించి మాట్లాడారు. బిగ్ బాస్ ఫేమ్ సీత కూడా మాట్లాడింది. బిగ్ బాస్ తర్వాత బాగానే ఆఫర్లు వస్తున్నాయని చెప్పింది.