ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ రావటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. బెదిరింపు కాల్స్‌, మెసేజ్ ల విషయాన్ని అధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్‌ రావడంపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత డీజీపీ ద్వారక తిరుమలరావుతో మాట్లాడారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here