కుటుంబ గొడవల మీద మొదటిసారి స్పందించారు మంచు మనోజ్. తాను ఆస్తులు, డబ్బు కోసం పోరాటం చేయడం లేదన్నారు. ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నానని మనోజ్ చెప్పారు. తనకు న్యాయం జరగడం లేదన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. న్యాయం జరిగే వరకూ అందరినీ కలుస్తానని స్పష్టం చేశారు.