వయసు ఎక్కువయ్యే కొద్ది మహిళలకు ఆరోగ్యం విషయంలో సవాళ్లు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా 30లు, 40ల వయసు దాటిన తర్వాత వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. అందుకే మహిళలు పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా పాటించాలి. ఆరోగ్యంపై నిత్యం దృష్టి సారించాలి. అయితే, మహిళలకు వచ్చే కొన్ని వ్యాధులను ప్రాథమిక దశలో బయటపడవు. వైద్య పరీక్షలతోనే తెలుస్తాయి. వీటిని ముందే గుర్తిస్తే తగ్గించడం సులభం అవుతుంది. ఆలస్యమైతే చాలా కష్టంగా మారుతుంది. అందుకే, 30, 40ల వయసులో ఉన్న మహిళలు కొన్ని వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఆ పరీక్షలు ఏవో ఇక్కడ చూడండి.