ఆర్థిక అక్రమాలు
“గత ప్రభుత్వం చేసిన తప్పులు మూలాలను కదిలించే స్థాయికి వెళ్లిపోయాయి. వీటిని సరిదిద్దడానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మా విభేదాలను కూడా పక్కన పెట్టాం. దీని వెనుక ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రజలకు ఇబ్బందులని తొలగించాలి అని కూటమి కట్టాము. నేను రివ్యూస్ చేస్తున్నప్పుడు గతంలో చాలా ఆర్థిక అక్రమాలు రూల్ బుక్ పాటించకుండా చేసినవి మా దృష్టికి వచ్చాయి. గత ప్రభుత్వం రెవెన్యూ అధికారులను చాలా ఇబ్బందులు పెట్టింది.రెవెన్యూ అధికారులను పెట్టి సినిమా టికెట్లు అమ్మించడం, ఇసుక దోపిడీ, ఇంకా అనేక అక్రమాలు జరిగాయి. అధికారంలో లేనప్పుడు సామన్యుడిలా బయట నుంచి చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఇంత మంది ఐఎస్ అధికారులు, సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు కానీ ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడం ఏంటి? ఐఏఎస్ చదివి, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యం అనిపించింది.”- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్