మంచు మనోజ్(manoj)మోహన్ బాబు(mohan babu)మధ్య రెండు రోజులుగా గొడవలు  జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ విషయంలో పోలీసులు కూడా జోక్యం చేసుకోవడంతో ఏ నిమిషం ఏం జరుగుతుందనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది.  రీసెంట్ గా ఈ విషయం మీద విష్ణు(vishnu)కూడా మాట్లాడుతూ తన ఆవేదనని వ్యక్తం చెయ్యడంతో పాటు తన తండ్రి మోహన్ బాబు తో పాటు తల్లి కూడా హాస్పిటల్ లో ఉందని చెప్పాడు. మోహన్ బాబు కూడా నిన్న రిలీజ్ చేసిన ఆడియోలో తన భార్య హాస్పిటల్ లో ఉందని చెప్పడం జరిగింది.

కానీ ఇప్పుడు మనోజ్ మాట్లాడుతు నా తల్లి హాస్పిటల్ లో ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆమె ఇంట్లోనే ఉన్నారు.కూర్చుని మాట్లాడుకోవడానికి నేను సిద్ధమని చెప్పడం జరిగింది.అదే టైం లో    రాచకొండ సీపీకి లక్ష రూపాయిల బాండ్ సమర్పించిన మనోజ్‌ తనంతట తాను గొడవలకు దిగనని..శాంతి భద్రతలకు విఘాతం కల్గించనని బాండ్ లో పేర్కొనడం జరిగింది.ఇక ఈ కేసులో మోహన్ బాబు, విష్ణు ల లైసెన్స్ డ్  రివాల్వర్లు ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

 


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here