పోస్టల్ సురక్ష స్కీమ్ ముఖ్యాంశాలు

  • ఈ పాలసీ చేరేందుకు కనీస గరిష్ట వయస్సు: 19-55 సంవత్సరాలు
  • మినిమమ్ సమ్ అష్యూర్డ్ : రూ.20,000, గరిష్టంగా రూ. 50 లక్షలు
  • 4 సంవత్సరాల లోన్ సదుపాయం
  • 3 సంవత్సరాల సరెండర్ సదుపాయం
  • 5 సంవత్సరాల కంటే ముందు పాలసీ సరెండర్ చేస్తే బోనస్‌ లభించదు.
  • ప్రీమియం చెల్లింపు వ్యవధి 55, 58 లేదా 60 సంవత్సరాలుగా నిర్ణయించుకోవచ్చు.
  • పాలసీని సరెండర్ చేసినట్లయితే హామీ మొత్తంపై దామాషా బోనస్ చెల్లి్స్తారు.
  • చివరిగా ప్రకటించిన బోనస్- సంవత్సరానికి రూ. 1000 సమ్ అష్యూర్డ్ పై రూ. 76 బోనస్
  • ఈ పాలసీ ప్రీమియం చెల్లింపు- నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షికం
  • ప్రీమియం చెల్లించడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

ఈ పాలసీపై లోన్ సదుపాయం

సత్య 19 సంవత్సరాల వయస్సులో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో సురక్ష ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. అతడు రూ.10 లక్షల పాలసీని కొనుగోలు చేస్తే… నెలవారీ ప్రీమియం మొత్తం 55 సంవత్సరాలకు రూ.1515, 58 సంవత్సరాలకు రూ.1463, 60 సంవత్సరాలకు రూ.1411. పాలసీదారుడు మెచ్యూరిటీ ప్రయోజనం 55 సంవత్సరాలకు రూ.31.60 లక్షలు, 58 సంవత్సరాలకు రూ.33.40 లక్షలు, 60 సంవత్సరాలకు రూ.34.60 లక్షలు పొందుతారు. ప్రీమియం చెల్లింపు విత్ డ్రా తేదీ లేదా మెచ్యూరిటీ తేదీ నుంచి 1 సంవత్సరంలోపు కన్వర్షన్ తేదీ రాకపోతే, పాలసీదారుని 59 సంవత్సరాల వయస్సు వరకు ఈ పథకాన్ని ఎండోమెంట్ అష్యూరెన్స్ ప్లాన్‌గా మార్చుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here