బ్రోకలీ, పాలకూర అందరి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బ్రోకలీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఒక నారింజ పండులో ఎంత విటమిన్ సి ఉంటుందో… బ్రోకలీలో కూడా అంతే ఉంటుంది. విటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్. ఇది మన శరీరానికి అత్యవసరమైనది. బ్రోకలీలో ఇనుము, కాల్షియం, జింక్, పొటాషియం, థయామిన్, ఫోలేట్, విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ కె వంటివి అధికంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు బ్రోకలీ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఊబకాయం బారిన పడిన వారు కూడా బ్రోకలీని ఆహారంలో భాగం చేసుకోవాలి.