గోవా అంటే అందమైన బీచ్‌లకు కేరాఫ్. ఇక్కడికి టూరిస్టుల తాకిడి ఎప్పుడూ ఉంటుంది. గోవాలోని బీచ్‌లు, నైట్‌లైఫ్ ఎంజాయ్ చేసేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రస్తుతం ఏడాది ఆఖరి నెల డిసెంబర్ కావడంతో గోవాకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. చాలా బీచ్‌లు జనాలతో కిటకిటలాడుతూ రద్దీగా ఉంటాయి. అయితే, కొందరు ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా బీచ్‌ల్లో చిల్ కావాలని ఆలోచిస్తుంటారు. స్నేహితులతో ఎంజాయ్ చేసేందుకు యూత్ ఇలా అనుకుంటూ ఉంటారు. రద్దీ లేకుండా సమయాన్ని ఆస్వాదించాలని అనుకుంటారు.