పెళ్లిలో జరిగిన ఘటనతో జీవితంపై విరక్తి చెంది ఈ చర్యకు ఒడిగట్టిందని సుజాత సోదరుడు రామయ్య తెలిపారు. అయితే భర్త సురేష్ తరచూ సుజాతను సూటిపోటి మాటలతో వేధిస్తుండేవాడని, పిల్లల కోసమే భరిస్తూ వచ్చిందని బంధువులు తెలిపారు. చిన్న, చిన్న విషయాలకే ఘర్షణ పడి నెల రోజులైనా భార్యతో మాట్లాడేవాడు కాదని అన్నారు. సురేష్ పెట్టిన మానసిక వేధింపులతోనే సుజాత పిల్లలతో కలిసి చనిపోవాలనుకుందని పోలీసులకు సుజాత సోదరుడు రామయ్య ఫిర్యాదు చేశారు. సుజాత, నాగ చైతన్య మృతికి సురేష్ కారణమని పేర్కొన్నారు. దీంతో సురేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గౌస్ మహ్మద్ బాషా తెలిపారు.
Home Andhra Pradesh అనంతపురం జిల్లాలో విషాదం.. భర్త వేధింపులు.. భార్య, కుమారుడు మృతి-wife and two children commit...