పార్వతీ దేవి కాశీలో అన్నపూర్ణ దేవిగా ఉండాలన్న కోరికను పరమేశ్వరుడికి చెప్పగా, పరమేశ్వరుడు ఆమెను కాశీకి తీసుకువచ్చారు. కాశీ విశ్వేశ్వరుడి ఆలయానికి సమీపంలో అన్నపూర్ణ దేవి ఆలయం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కాశీ విశ్వేశ్వర దేవాలయం దర్శించుకున్న తర్వాత అన్నపూర్ణ దేవి ఆలయానికి కూడా వెళ్తారు. అన్నపూర్ణ జయంతి నాడైతే కాశీలో ఉన్న ఈ ఆలయానికి చాలా ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. అన్నపూర్ణ దేవి అనుగ్రహం ఉంటే ఆహారం, డబ్బుకి లోటు ఉండదు. అలాగే సంతోషంగా ఉండొచ్చు.