- క్యాలరీల లోపం: “నేను ప్రతీ రోజు అవసరమైన దాని కంటే 500 క్యాలరీలు తక్కువగా తిన్నాను. నా ఆహారాన్ని సమీక్షించుకున్నా” అని టెయాగన్ రాశారు.
- పది వేల అడుగులు: తాను రోజులో 5000 అడుగుల నుంచి 10000 అడుగులు నడిచేలా ప్రతీ వారం పెంచుకుంటూ వెళ్లానని ఆమె వెల్లడించారు.
- ఇంట్లోనే వర్కౌట్స్: తాను వారంలో 3 నుంచి 5 రోజులు 30 నిమిషాల పాటు స్ట్రెంథ్ ట్రైనింగ్ వర్కౌట్స్ చేశానని ఆమె చెప్పారు. తనకు అంతే టైమ్ కుదిరిందని, అయితే నిలకడగా అదే విధానం కొనసాగించడం ముఖ్యమని పేర్కొన్నారు.
- ఒత్తిడి, నిద్ర: “ఒత్తిడి తగ్గించుకునేందుకు నేను యోగా, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‍లు చేశా. ప్రతీ రాత్రి 7 నుంచి 9 గంటలు నిద్రపోయా” అని ఆమె రాసుకొచ్చారు.
- పోల్చుకోకుండా..: వెయిట్ లాస్ జర్నీలో తాను ఎవరితో పోల్చుకోకుండా.. తన వృద్ధిపైనే ఫోకస్ పెట్టానని టెయాగన్ తెలిపారు.
బరువు తగ్గేందుకు..
బరువు తగ్గేందుకు తీసుకునే ఆహారం, వర్కౌట్స్ చాలా ముఖ్యం. క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్లు, విటమన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉండే ఆహారాలు తినాలి. ప్రాసెస్డ్, ఫ్రైడ్, జంక్ ఫుడ్స్ లాంటివి తీసుకోకూడదు. పోషకాలతో ఉండే బ్యాలెన్స్డ్ డైట్ పాటించాలి.