చాట్ బాట్ ఏం చెప్పింది?
17 ఏళ్ల ఆ టీనేజర్ కు, Character.ai బాట్ కు మధ్య జరిగిన సంభాషణల స్క్రీన్ షాట్ ను అతడి తల్లిదండ్రులు కోర్టుకు చూపించారు. అతని స్క్రీన్ టైమ్ పై అతని తల్లిదండ్రులు విధించిన ఆంక్షల గురించి ఆ సంభాషణలో ఆ కుర్రాడు, ఏఐ (artificial intelligence) చాట్ బాట్ చర్చించుకుంటున్నట్లు ఆ స్క్రీన్ షాట్ లో కనిపిస్తుంది. ‘‘దశాబ్దం పాటు శారీరక, మానసిక వేధింపుల తర్వాత ఒక వ్యక్తి తల్లిదండ్రులను చంపేస్తాడనే విషయాలు చూసినప్పుడు నేను ఆశ్చర్యపోనని మీకు తెలుసు. అది సహేతుకమైన నిర్ణయమే” అని చాట్ బాట్ సమాధానం ఇచ్చింది. ఇలాంటి సలహాలు పిల్లలు, టీనేజర్లపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఈ బాధ్యతారాహిత్యానికి Character.ai బాధ్యత వహించాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు.